కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్న వ్యక్తులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. స్వల్ప కాలంపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై సైనికులను నియమించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని యువత తప్పుబడుతోంది. సైన్యంలో చేరడం కోసం రెండేళ్ళ నుంచి శ్రమించి, చదువుకుంటున్న వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన పథకం వల్ల తమ దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతింటాయని.. అగ్నివీరులుగా నియమితులైనవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే తిరిగి రెగ్యులర్ కేడర్‌లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. వయో పరిమితిని సడలించాలి డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా నియామక ప్రక్రియను రెండేళ్ళపాటు వాయిదా వేసినందువల్ల వయోపరిమితిని రెండేళ్ళు సడలించాలని కోరారు. అగ్నిపథ్ స్కీమును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పై తీవ్ర నిరసనలు
June 15, 2022
0
Tags