పంచదార కు రెక్కలు ?

Telugu Lo Computer
0


పంచదార బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనుందంటూ రాయిటర్స్‌, బ్లూంబర్గ్‌లు కథనాలు ప్రచురించాయి. ఈ ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం 10 మిలియన్‌ టన్నులకే పరిమితి చేసే అవకాశం ఉందంటూ తేల్చి చెప్పాయి. బయటి దేశాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తే దేశీయంగా కొరత వచ్చి ధరలు పెరగవచ్చనే అంచనాతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. దేశంలో వార్షిక చక్కెర ఉత్పత్తి సామర్థ్యం 35.5 మిలియన్‌ టన్నులు. ఇందులో 9.5 మిలియన్‌ టన్నుల చక్కెరని ఈ ఏడాది ఎగుమతి చేయోచ్చని ముందుగా అంచనా వేసి ఆ మేరకు అనుమతులు జారీ చేశారు. అయితే సగం ఏడాది కూడా పూర్తి కాకముందే ఇప్పటికే 8 మిలియన​ టన్నుల చక్కెర ఎగుమతులకు ఆర్డర్లు వచ్చాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో చక్కెరకు డిమాండ్‌ పెరిగింది. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే మన దేశంలో ఉన్న చర్కెర అంతా విదేశాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులపై కేంద్రం పరిమితి విధించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో చక్కెర కిలో ధర సగటున 41.50 దగ్గర ఉంది. ప్రభుత్వం కనుక ఎగుమతులపై పరిమితి విధిస్తే రాబోయే రోజుల్లో రూ. 40 నుంచి 43 మధ్యనే ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు వర్గాలు అంటున్నాయి. అలాకాని పక్షంలో గోదుమల తరహాలోనే చక్కెర ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం వార్తలు బటయకు రావడంతో స్టాక్‌ మార్కెట్‌లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)