అర్జెంటీనా దేశాధ్యక్షుని నిర్లక్ష్యానికి భారీ మూల్యం

Telugu Lo Computer
0


కరోనా విజృంభిస్తున్న సమయంలో అర్జెంటీనా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో 2020 జులైలో అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్‌లు రూల్స్‌ను బ్రేక్ చేసి, ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. దాంతో ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ పార్టీపై అర్జెంటీనా ఫెడరల్ కోర్టు తీవ్రంగా మండిపడింది. ఇటీవలే పార్టీపై విచారణ జరిపిన కోర్టు భారీ జరిమానాను విధించింది. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.." ఆ పార్టీ వెనుక ఎలాంటి హానికర ఉద్దేశాలు లేవు. అది కేవలం నా నిర్లక్ష్యం వల్లే జరిగింది. మమ్మల్ని క్షమించండి' అని వేడుకున్నాడు. దాంతో కోర్టు అధ్యక్షుడికి 1.6 మిలియన్ పోసెస్‌లు, మొదటి మహిళకు 1.4 మిలియన్ పోసెస్‌ల జరిమానా విధించింది. ఆ డబ్బులను ఇద్దరూ మాల్‌బ్రాన్ వ్యాక్సిన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా అందించాలని ఆదేశించింది. అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని జరిమానాను కట్టినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)