కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కపిల్ సిబాల్ సమాజ్ వాదీ పార్టీ తరపు నుంచి లక్నోలో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కపిల్ సిబల్ నామినేషన్ పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేశారని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు కపిల్ సిబాల్ నామినేషన్
May 25, 2022
0
Tags