కర్ణాటక లోని హుబ్లీ నవనగర ఎల్‌ఐజీ వద్ద చోటు చేసుకుంది. ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె (30) తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎల్‌ఐజీ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. ఇతను మూడు రోజుల క్రితమే మృతి చెందాడని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నా మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతదేహంతో కుటుంబం సహజీవనం !
March 04, 2022
0