గాల్లోనే జింకను పట్టిన చిరుత...!

Telugu Lo Computer
0


అడవిలో జింకల గుంపును చిరుత పులి తరుముతుంటుంది. పెద్ద సంఖ్యలో ఉన్న జింకల గుంపు పొదల్లోంచి పరుగెత్తుకుంటూ చిరుత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. వాయు వేగంతో పరుగెత్తిన చిరుత.. ఓ జింకను పట్టుకోబోతుంది. ఆ సమయంలో జింక గాల్లోకి ఎగరగా.. చిరుత కూడా గాల్లోనే ఉండి దాన్ని పట్టేస్తుంది. అయితే కిందపడ్డాక పట్టు కోల్పోయిన చిరుత దాన్ని వదిలేయడంతో.. జింక తప్పించుకుపోయింది. జింకను చిరుత పులి వేటాడే అనేక వైరల్ వీడియోలను సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ చిరుత గాలిలో ఎగురుతూ జింకలను వేటాడడంతో ఈ వీడియో కాస్త ప్రత్యేకంగా నిలిచింది. ఇందుకు సంబందించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఫ్లైయింగ్ క్యాచ్.. లైఫ్ అండ్ నేచర్' అని కాప్షన్ ఇచ్చారు. చిరుత గాలిలో ఎగురుతూ జింకలను వేటాడడం చుసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే 42 వేల వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'వావ్.. వాట్ ఏ ఛేజ్', 'తెలివైన జింక' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)