గుండెపోటుతో బస్సు డ్రైవర్‌ మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం అగరాల వద్ద మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో సీటు లోనే మృతి చెందాడు. అది గమనించిన ప్రయాణికుడు వెంటనే స్పందించి అప్రమత్తమై స్టీరింగ్‌ను కంట్రోల్‌ చేశాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)