తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోచారం మున్సిపల్ పరిధి సంస్కృతి టౌన్ షిప్ లోని శ్రీ విద్యానికేతన్ (మోహన్ బాబు స్కూల్) దగ్గర ఆందోళన పలువురు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అసోసియేషన్ కు సంబంధించిన పాఠశాలను ముసివేయడం పై వారు అభ్య౦తరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం సింగపూర్ టౌన్ షిప్ లో ఇల్లు తీసుకోవడం జరిగిందని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అసోసియేషన్ కు సంబంధించిన శ్రీ విద్యానికేతన్ ముసివేయడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు పెద్ద మనసు చేసుకొని ఈ అసోసియేషన్ కు సంబంధించిన పాఠశాలను మూసివేయడం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
శ్రీ విద్యానికేతన్ దగ్గర పేరెంట్స్ ఆందోళన
March 04, 2022
0
Tags