తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలకు చెందిన పోచయ్యగౌడ్ (42) గురువారం రాత్రి చికెన్ తింటుండగా ప్రమాదవశాత్తు ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు షాద్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతిచెందాడు. పోచయ్యగౌడ్ కుమార్తెకు పెళ్లి కుదిరిందని, ఉగాది తర్వాత వివాహం జరగాల్సి ఉండగా ఇలా జరగటం కుటుంబంలో విషాదాన్ని నింపింది.
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మృతి
March 04, 2022
0
Tags