ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తక్షణమే ఆపాలి : ఐరాస

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపివేయాలంటూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమధికారాన్ని సమర్థిస్తూ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించింది. రష్యాకు వ్యతిరేకంగా తీర్మానానికి అనుకూలంగా 141 సభ్య దేశాలు ఓటు వేశాయి. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అప్ఘానిస్తాన్, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. రష్యాకు అనుకూలంగా మరో ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో ఓటింగ్‌కు భారత్ సహా 35 దేశాలు దూరంగా ఉన్నాయి. మెజార్టీ దేశాలు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఓటువేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. యుద్ధాన్ని విరమించి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలని సూచించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్‌ మొదటి నుంచే తటస్థంగా వ్యవహరిస్తోంది. ఇరుపక్షాలు శాంతియుత మార్గంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంది. ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ గైర్హాజర్ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)