శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర

Telugu Lo Computer
0


మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు సుపారీ గ్యాంగ్‌తో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌ హత్యకు కుట్రపన్నారు. ఫరూక్‌ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతను షేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి మంత్రి హత్యకు కుట్ర పన్నిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు 12 కోట్ల రూపాయల సుపారీ డీల్ కుదిరినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)