రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు!

Telugu Lo Computer
0


మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. మూడు నెలల్లో ప్లాన్‌ను పూర్తి చేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం ఆరు  నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదని కోర్టు వెల్లడించింది. రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలంది. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలి. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని  హైకోర్టు పేర్కొంది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది .


Post a Comment

0Comments

Post a Comment (0)