నాలుగు వారాల్లో రెండు ఇండ్లను నిర్మించిన ఆర్మీ

Telugu Lo Computer
0


గుజరాత్ లోని గాంధీనగర్ లో సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతంలో ఈ రెండు ఇండ్లను ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు నిర్మించారు. ఈ ఇండ్లను ఎంఈఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్ ప్రారంభించారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో భాగంగా పూర్తిగా త్రీడీ కాంక్రీట్ బ్లాకులతో వేగంగా నిర్మాణం పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అన్ని అధునాతన సౌకర్యాలతో ఈ ఇళ్లను నాలుగు వారాల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు. ఆర్మీ జవాన్ల కోసం వీటిని  త్రీడీ ప్రిటింగ్ టెక్నాలజీ సాయంతో నిర్మించినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)