భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో నేడు జరిగింది. ఈ సమావేశానికి. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర కీలక నేతలు అందరూ హాజరయ్యారు. ఈ పార్లమెంటరీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక పై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పార్లమెంటరీ సమావేశంలో వెంకయ్యనాయుడు పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా రానుంది. అలాగే సామాజిక న్యాయంపై దేశ వ్యాప్తంగా బిజెపి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీజేపీ పార్లమెంటరీ సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 14వ తేదీ వరకు బిజెపి సమావేశాలు నిర్వహించనుంది.
రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ?
March 29, 2022
0
Tags