పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 31 న గురువారం ఉదయం 11 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల బయటకు, బహిరంగ ప్రదేశాలకు రావాలని, గ్యాస్ బండలకు పూల దండలు వేసి గంటలు, డ్రమ్స్, పళ్లాలు, ఇతర పరికరాలు మోగించాలని కోరింది. ఈ ధరల పెరుగుదల అంశాన్ని ఈ మేరకు చెవిటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ద్రవ్యోల్బణం, ఇంథనం ధరల పెంపుపై మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు మెహంగై ముక్త్ భారత్ అభియాన్ పేరుతో వారం రోజులు కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నది.
పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా 31న బెల్స్, డ్రమ్స్ మోగించండి!
March 26, 2022
0
Tags