తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లోని ఆదర్శ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శుక్రవార రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల గేటు ఎదుట రెండు ఇనుప కడ్డీల చుట్టూ వస్త్రం చుట్టి, నేలలో పాతారు. దాని ముందు.. రెండు కోడిగుడ్లు, పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. యథావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గేటు ముందర పసుపు, కుంకుమ, కోడిగుడ్లు పడి ఉండటాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యాజమాన్యం వాటిని తొలగించి ఎప్పటిమాదిరిగానే తరగతులు నిర్వహించారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ మహమ్మద్ జావెద్‌ను వివరణ అడగ్గా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి పోకిరీలు చేసిన పనిగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది చేత వాటిని తొలగించినట్లు స్పష్టం చేశారు.
పాఠశాల ఎదుట క్షుద్ర పూజల కలకలం!
March 26, 2022
0