బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో, "రష్యా ప్రజలకు సాయం చెయ్యండి.. క్రిప్టోకరెన్సీ ద్వారా విరాళాలను స్వీకరిస్తున్నారు. 'బిట్‌కాయిన్-ఎథెరియం' అంటూ ఆగంతకులు ట్వీట్ చేశారు. అంతేకాదు.. "యుక్రెయిన్ ప్రజలకు అండగా నిలవండి. క్రిప్టోకరెన్సీలో విరాళాలను అంగీకరిస్తున్నారు." అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. హ్యాకర్లు ప్రొఫైల్ పేరును కూడా ICG OWNS INDIAగా మార్చారు. అయితే, ఇప్పుడు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. హ్యాకింగ్‌కి సంబంధించిన సమాచారం అందిందని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్ వెనుక కారణాలను పరిశీలిస్తోందని, ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు
హ్యాకింగ్‌కి గురైన జేపీ నడ్డా ట్విట్టర్!
February 27, 2022
0
Tags