దేశంలో తాజాగా10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 243 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,13,724కు చేరింది. 10,409 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921గా నిలిచింది. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.25 శాతం మాత్రమే. అలాగే కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 177.44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు.
దేశంలో కొత్తగా 10,273 కరోనా కేసులు నమోదు
February 27, 2022
0
Tags