ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు ఠంచనుగా సమయానికి డ్యూటీకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ సమయానికి కార్యాలయానికి రాకుంటే సెలవు కింద పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని, సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని సూచించింది. 11 గంటల లోపు ఆలస్యంగా వచ్చిన వారికి నెలలో మూడు సార్లు మాత్రమే వారి డ్యూటీని పరిగణిస్తామని, ఆ తర్వాత ఎప్పుడు లేట్‌గా వచ్చినా సెలవుగా హాజరు లెక్కిస్తామని పేర్కొంది.
ఉద్యోగులు సమయానికి డ్యూటీకి రావాలని ఆదేశాలు జారీ
February 26, 2022
0
Tags