అన్నితరగతుల్లో ఒకేసారి అమలు!

Telugu Lo Computer
0


వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అజీం ప్రేమ్‌జీ వర్సిటీతో కలిసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారికి తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022-23)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్లాలంటే పదో తరగతికి వచ్చేసరికి పదేళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే తెలుగు మాధ్యమం ఆప్షన్‌ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను రెండు భాషల్లో ముద్రిస్తామని, ఒకవైపు తెలుగు, మరో పుటలో ఆంగ్ల మాధ్యమంలో పుటలు ఉండేలా చూస్తామన్నారు. ద్ది నెలల క్రితమే అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీతో కలిసి ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు 9 వారాలపాటు శిక్షణ ఇచ్చాం. 1350 మంది శిక్షణ పొందారు. ఈసారి పెద్ద సంఖ్యలో శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో మొత్తం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే వారిలో అనేక మంది ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఒకేసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంపై సమస్యలేమీ ఉండవు. ఎందుకంటే ఇప్పటికే వేలాది బడుల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగుతోంది. గతంలో ఆంగ్ల మాధ్యమంలో చేరిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఆంగ్ల భాషలో మెరుగయ్యారా? లేదా? అని తెలుసుకునేందుకు అధ్యయనం చేయిస్తాం.

Post a Comment

0Comments

Post a Comment (0)