తెలంగాణ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మెడిసిన్ కిట్ వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐటీ & ఈసీ డిపార్ట్‌మెంట్ డిజిటల్ మీడియా విభాగం వీటిని విడుదల చేసింది. ప్రజలు కోవిడ్-19 లక్షణాలను గమనించిన వెంటనే మందులు తీసుకోవడం ప్రారంభించాలని సూచించింది. అయితే వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలని, వైద్యుల సలహాతో మందులు వాడితే కోవిడ్ తీవ్రతను పెరగకుండా ఆపొచ్చని ప్రభుత్వం పేర్కొంది.
* కోవిడ్ మందులలో ప్రతిరోజూ ఉదయం ఐదు రోజుల పాటు అజిత్రోమైసిన్ (యాంటీబయోటిక్/ యాంటీవైరల్)
* పారాసెటమాల్ (జ్వరం కోసం) ఉదయం ఒకటి మరియు రాత్రి మరొకటి ఐదు రోజులు
* లెవోసెటిరిజైన్ (జలుబు కోసం) ప్రతి రాత్రి ఐదు రోజులు.
* రానిటిడిన్ (అసిడిటీ కోసం) ఉంటాయి. ) ప్రతిరోజూ ఉదయం ఐదు రోజులు.
* విటమిన్ సి, మల్టీవిటమిన్ మరియు విటమిన్ - డి (రోగనిరోధక శక్తి కోసం) ఐదు రోజులు.
వీటితో పాటు కోవిడ్ 19 లక్షణాలు ఉంటే నిరంతరం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. సాధారణ వేగంతో ఆరు నిమిషాలు నడవలేకపోవడం, జ్వరం మరియు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.