ఆంధ్రప్రదేశ్ లో 13,618 మందికి కరోనా కేసులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 49,143 శాంపిల్స్ ని పరీక్షించగా 13,618 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2222573 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొ క్కరు చొప్పు న మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14570కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 106318 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో8,687 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2101685కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,22,83,369 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1791 కొత్త కేసులు వెలుగుచూశాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా 1650 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1409 కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)