వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేతలు

Telugu Lo Computer
0


టీడీపీలో మరో ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బంధుత్వం కలుపుకున్నారు. రాజకీయ - వ్యాపార రంగాల్లో ఉన్న వారు తమకు తాముగా బంధుత్వాలు కలుపుకోవటంలో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా మరో ఇద్దరు కీలక నేతలు వియ్యంకులు అయ్యేందుకు సిద్ధమైయ్యారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుుడిగా ఉన్న బోండా ఉమా,  నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులుగా మారబోతున్నారు. బోండా ఉమా కుమరుడు సిద్దార్ధ్, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ మేరకు రెండు కుటుంబాల మధ్య నిర్ణయం జరిగింది. మార్చి 27న వీరి వివాహ నిశ్చితార్ధం కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ చేసేందుకు నిర్ణయించారు. అమెరికాలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. టీడీపీలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)