తక్కువ పెట్టుబడి తో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలను సొంతం చేసుకుని మార్కెట్ స్ట్రాటజీ లు దిల్ రాజుకు మాత్రమే బాగా తెలుసు అని చెప్పవచ్చు. ఇక పోతే ఇప్పటి వరకు తక్కువ బడ్జెట్ తో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈయన సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఉదాహరణగా రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 15వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. నాకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు దిల్ రాజు. తన భార్య మరణంతో తనకు శోకమే మిగిలింది అని ఆయన మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. 2017 వ సంవత్సరంలో తన భార్య అనిత చనిపోవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అని తెలిపారు. తన భార్య మరణం వల్ల చాలా కృంగి పోయానని అటువంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక భార్య మరణం తట్టుకోలేక సినిమాలలోనే తన జీవితాన్ని గడిపానని, సినిమాలే తనను మనిషిగా నిలబెట్టాయి అని దిల్ రాజు వెల్లడించారు. కామెడీ ఎక్కువగా ఉండే సినిమా కథలను ఎక్కువగా ఇష్టపడతానని అలాంటి సినిమాలే తన బ్యానర్ లో ఎక్కువగా రూపుదిద్దుకుంటాయి అని దిల్ రాజు వెల్లడించారు.. అదృష్టాన్ని కాదు కాలాన్ని నమ్ముతాం అని స్పష్టం చేశాడు.. 2017 లో భార్య మరణించిన తర్వాత సినిమాల ఫలితాల విషయంలో చాలా నమ్మకంతో ఉండేవాడినని ఆ నమ్మకం నిజమైంది అని ఆయన వెల్లడించారు. కరోనా వల్ల సినిమాలో భయం పెరిగిపోయిందని ఫస్ట్ వేవ్ సమయంలో భయం వేస్తే ఇక సెకండ్ వేవ్ సమయంలో అజాగ్రత్తగా ఉన్నామని థర్డ్ వేవ్ సమయంలో ఎలా జీవించాలో అర్థమైందని దిల్ రాజు అన్నారు.
ఆమె మరణంతో శోకమే మిగిలింది !
January 26, 2022
0
Tags