కుప్పకూలిన వంతెన

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం భీమ్​పురం గ్రామ సమీపంలో పీజేపీ (ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్) కెనాల్​పై నిర్మించిన బ్రిడ్జి  కుప్పకూలింది. భీమ్​పురంలోని ఓ ఇంటి స్లాబ్ కోసం కాంక్రీట్, సిమెంట్, ఇసుకతో కూడిన మిక్సింగ్ తీసుకొని వస్తున్న లారీ కాలువ దాటుతుండగా బ్రిడ్జి కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్నో ఏండ్ల కింద నిర్మించిన బ్రిడ్జి కూలిపోయే దశకు చేరుకుందని, కొత్తది నిర్మించాలని సంబంధిత ఆఫీసర్లను కోరినా స్పందించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా పెద్ద చింతరేవులోని ఆంజనేయస్వామి టెంపుల్​కు వెళ్లాలంటే ఇదొక్కటే దారి. ప్రతి శనివారం, అమావాస్య రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే భీమ్ పురానికి వెళ్లాలంటే చిన్న చింతరేవుల, రేవులపల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)