ఏజెన్సీలో గంజాయి తోటలు ధ్వంసం

Telugu Lo Computer
0



విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో "ఆపరేషన్ పరివర్తన" కార్యక్రమంలో భాగంగా 87 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు పోలీసులు. ఏజెన్సీలోని చింతపల్లి మండలం తమ్మంగుల, కుడుముసారి పంచాయతీ గ్రామాలైన కిలిమిసింగి, దానుడివీధి, దబ్బగరువు, ధోని పొలాలు, భీమునిపల్లి, సంపంగిపుట్టు అటవీ ప్రాంతాలలో 87 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎస్ఈబీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాతో ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఎస్ఈబీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. చింతపల్లి మండలం తమ్మంగుల పంచాయతీ లుంబూరు, ధోనిపోలాలు, పూసల పాలెం, బొద్దుజివ్వలో 75 ఎకరాల్లో గంజాయి తోటలను సోమవారం నాశనం చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులు గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)