బసవరాజు బొమ్మైకి తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషికి ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా అరగంట పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి హూబ్లీకి బయలుదేరిన ఈ విమానం ఉదయం 7.30కి ల్యాండ్​ అవ్వాల్సి ఉండగా ఇరువై నిముషాలు ఆలస్యమైంది. 'నేను ఓటు వేయడానికి వచ్చాను. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది' అని బొమ్మై వెల్లడించారు. కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవేరీ జిల్లాలోని శిగ్గావ్​లో సీఎం శుక్రవారం తన ఓటును బొమ్మై వినియోగించుకున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)