ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణం !

Telugu Lo Computer
0


తాను ఈ రోజు తెలుగు ప్రేక్షకుల మదిలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అమ్మే అని ఎన్టీఆర్‌ ఎప్పుడూ చెపుతూ ఉంటాడు. అయితే తనను అమ్మ ఓ విషయంలో మాత్రం వార్నింగ్ ఇచ్చేదని తాజాగా చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ ప్రెస్‌మీట్ గురువారం ముంబైలో జరిగింది. ఈ ప్రెస్‌మీట్లో ఎన్టీఆర్‌ను తల్లి ఏ విషయంలో వారించింది ? అసలు నాడు ఏం జరిగిందో చెప్పాడు. ఇక నటుడు అనే వాడు ఎప్పుడూ ఒకే విధమైన పాత్రలు చేయకూడదని ఎప్పుడూ విలక్షణమైన పాత్రలు చేస్తూ ఉండాలని తాను నమ్మేవాడిని అని.. రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదు.. తనకు ఎంతో ఆప్తుడు అని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక అజయ్‌దేవగన్ సినిమాలు చూస్తూ తాను పెరిగానని  ఆయనతో పని చేస్తుంటే ఓ గురువుతో పని చేస్తున్నట్టుగా ఉందని చెప్పాడు. ఆయన పూల్ ఔర్ కాంటే సినిమాలో చేసిన యాక్షన్ స్టంట్ తనకు ఇప్పటికీ గుర్తు ఉందని.. రెండు బైక్స్‌పై ఆయన చేసిన రిస్కీ స్టంట్‌తో తాను స్టన్ అయిపోయానని గుర్తు చేసుకున్నాడు. తాను కూడా అలా చేయాలని అనుకుంటున్నానని అమ్మతో చెపితే. అవన్నీ సినిమాల్లో మాత్రమే కుదురుతాయని, నిజ జీవితంలో కుదరవు అని ఆమె హెచ్చరించిందని చెప్పాడు. అలా తాను గురువులా భావించే వ్యక్తితో కలిసి ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్పగా ఉందని ఎన్టీఆర్ చెప్పాడు. డీ పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య రు. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదలవుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం  ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)