రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు

Telugu Lo Computer
0

 


రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన సీఎస్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీ విరమణ తరువాత ఏపి ప్రభుత్వ సలహదారుగా కూడా పని చేశారు. అదే విధంగా స్కిల్ డవలప్ మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలు అందించారు. అయితే యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు ప్రస్తుత వైసీపీ సర్కార్ దర్యాప్తులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా గతంలో స్కిల్ డవలప్ మెంట్ సంస్థలో యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో అక్రమాలు జరిగినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. దీంతో అప్పట్లో స్కిల్ డవలప్ మెంట్ సంస్థ ద్వారా సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)