30 కిలోల కొకైన్ ప్యాకెట్లను పోలీసులకు అప్పగింత !

Telugu Lo Computer
0


అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి సరదాగా బీచ్‌కు వెళ్లాడు. ఎప్పటిలాగే బీచ్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. అయితే సముద్రపు అలల్లో తేలిపోతున్న అతడికి కొన్ని ప్యాకెట్లు కనిపించాయి. మొదట వాటిని పెద్దగా పట్టించుకోని ఆ వ్యక్తి. ఆ తరువాత వాటిని ఎలాగోలా అందుకోగలిగాడు. అలా తాను పట్టుకున్న ఆ ప్యాకెట్లు పూర్తిగా సీల్ చేయబడి ఉన్నాయి. వాటిని నేరుగా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతడి నిజాయితీని ప్రశంసించారు. ఈ ప్యాకెట్లలలో మొత్తం 30 కిలోల కొకైన్ ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.ఏడున్నర కోట్లు. దీంతో తమకు దీన్ని తీసుకొచ్చి ఇచ్చిన ఆ వ్యక్తి నిజాయితీని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సముద్రంలో ఈ రకమైన డ్రగ్స్ దొరకడం ఫ్లోరిడాలో కొత్తమీ కాదు. ఇదే సంవత్సరం, ఫ్లోరిడాలో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక సమూహం సముద్రపు అలలలో సుమారు 11 కోట్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నారు. దాన్ని కూడా సీల్డ్ ప్యాకెట్లలో సీల్ చేసి సముద్రంలో పడేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కేసు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇన్ని కోట్ల డ్రగ్స్ ఎవరు సముద్రంలో పడేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. అలాగే ఈ ప్యాకెట్లు విసిరేస్తుంటే అసలు దాని వ్యాపారం ఎంత పెద్దది అవుతుందనే కోణంలో ఫ్లోరిడా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)