వడ్డే నవీన్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమా నవీన్ వడ్ఢేకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ సినిమాలో జోడిగా మహేశ్వరి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విజయం తరువాత ఆయన మరి కొన్ని సినిమాలలో నటించాడు. ఆ తర్వాత రోజుల్లో మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు, చాలా బాగుంది, మా బాలాజీ వంటి కొన్ని చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడని అనిపించుకున్న నవీన్ ఆ తర్వాత స్నేహితులు, బాగున్నారా, నా ఊపిరి ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించాడు. అయితే చూస్తుండగానే నవీన్ తెరపైన కనుమరుగయ్యారు. 2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. ఆయన చివరగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమాలో కనిపించారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే వడ్డే రమేష్ కి నందమూరి కుటుంబానికి ముందు నుండి మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. ఆ చనువుతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో ఎన్టీఆర్ మొదటి కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని ప్రేమించి ఇంట్లో పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. కుటుంబ కలహాల ప్రభావం.. వడ్డే నవీన్ కెరీర్ పై తీవ్రంగా చూపించింది. పెద్ద ఫ్యామిలీ కి చెందిన కూతురితో విడాకులు అంటే ఆశ మాషి వ్యవహారం కాదు కదా. ఇక అక్కడ మొదలయిన పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ బయట చాలా మందికి వడ్డే నవీన్ ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయమే తెలియదు.
వడ్డే నవీన్ ఎక్కడ ?
December 10, 2021
0
Tags