కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా చాపకింద నీరులా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి నాలుగో కేసు వెలుగులోకి రావడంతో భారత్‌లో తీవ్ర కలకలం రేగింది. కరోనా చివరి వేవ్‌లో డెల్టా వేరియంట్ సోకిన తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అధిక జ్వరం, బలహీనత, ఆహారం రుచి, సువాసన తెలియకపోవడం వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ విషయంలో ఈ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే.. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు అవితలనొప్పి, తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు. ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు.
ఒమిక్రాన్ లక్షణాలు భిన్నమైనవి!
December 05, 2021
0