పాములు దురాయని ఇంటికి నిప్పు

Telugu Lo Computer
0


అమెరికాలోని  మాంట్‌గోమెరీలోన ఓ ఇంట్లోకి పాములు చొరబడ్డాయి.. వాటిని గమనించిన ఇంటి యజమాని బయటకు పంపే ప్రయత్నం చేశాడు. అయితే అవి కనిపించకుండా లోపలికి వెళ్లడంతో వాటిని బయటకు రప్పించేందుకు పొగపెట్టాడు.. ఆ పొగ కాస్తా ఇల్లు మొత్తం కమ్మేసింది. దీంతో అక్కడి నుంచి బయటకు వచ్చాడు సదరు వ్యక్తి. ఇదే సమయంలో మంటలు చెలరేగి ఇంట్లోని మండే వస్తువులకు అంటుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంటి యజమాని తేరుకునే లోపే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వచ్చేలోపే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందిలోని ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇల్లు కాలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై ఇంటి యజమాని మాట్లాడుతూ.. 10 లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు వివరించాడు. ఇంట్లోని అన్ని వస్తువులు కాలిపోయాయని తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)