ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఓ బోర్డు కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన తెలిపారు. రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఏకంగా సీఎం జగన్ ఫొటో, పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలంగా రేపింది. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త' అంటూ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే దారిలో ఈ ఫ్లెక్సీ ఉంది. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. ఈ బోర్డు రోడ్డు వేసేవరకు ఎవరైన తొలగిస్తే.. వారి వారి కుటుంబం ఈ రోడ్లపైన పోతారు' అంటూ సదరు బోర్డులో పేర్కొన్నారు. కాగా, ఆ మార్గంలో వెళ్లే వారంతా ఫ్లెక్సీని ఆసక్తిగా గమనిస్తున్నారు.
'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త'
December 12, 2021
0
Tags