దేశంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల రోజుల్లో కేజీ నూనె ధర రూ.8 నుంచిరూ.10 వరకు తగ్గింది. మరో నాలుగు రూపాయలు తగ్గే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది 120 లక్షల టన్నుల సోయాబీన్ ఉత్పత్తి, రెండు లక్షల టన్నుల మేర అదనంగా వేసిన వేరుశనగ పంటల కారణంగా త్వరలోనే వంట నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే 150కి దిగువగా వంటనూనెల ధరలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
తగ్గనున్నవంట నూనెల ధరలు?
December 12, 2021
0