"బింబిసారా" సినిమా టీజర్

Telugu Lo Computer
0


కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న'బింబిసార' సినిమాలో నటిస్తున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… అనేది దీని ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ కి ఇది 18వ చిత్రం కావడం విశేషం. తాజాగా సినిమా టీజర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ కి కూడా మంచి స్పందన లభిస్తోందని యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మైథిలాజికల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించడం ఇదే తొలిసారి. టైమ్ ట్రావెల్​ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. కళ్యాణ్ సరసన కేథరిన్ థెరిస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇటీవల 'బింబిసార' ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు కల్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)