లతీఫ్‌షా గుట్ట !

Telugu Lo Computer
0


ఇరాక్  రాజధాని బాగ్దాద్ నగరానికి చెందిన లతీఫుల్లాఖాద్రీ అనే మత గురువు తమ మతప్రచారం చేసేందుకు, ప్రజలకు మంచి బోధనలు చేయడానికి క్రీ।శ। 960 నుండి 1050 సంవత్సరాల మధ్యకాలంలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి వచ్చాడు.  కొంతకాలం తరువాత నల్లగొండ పట్టణానికి వచ్చి అక్కడి గుట్టపైన నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. అలా అక్కడ అతను అనేక సంవత్సరాలు ఉండడంవల్ల ఆ గుట్టకు లతీఫ్‌షా గుట్ట అని పేరు వచ్చింది. లతీఫ్ చెప్పే బోధనలు వినడానికి భక్తులు 500 మెట్లు సులభంగా ఎక్కి గుట్టపైకి వచ్చేవారు. అలా మత బోధనలు చేస్తూ కొంత కాలం గడిచిన తరువాత లతీఫ్‌షా, అతని అన్నకుమారులైన ఎస్‌కె అల్లావుద్దీన్‌, ఎస్‌కె ఫరీద్‌లు గుట్టపైనే సమాధి అయ్యారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వారం రోజులపాటు దర్గా కింద మెట్ల వద్ద ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడుతాయి. ఉమ్మడి హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు చెందినవారు కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో బెంగుళూరు కవ్వాలీ బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉర్సు తొలిరోజున హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న మదీనా మసీదు నుండి గంధాన్ని ఊరేగింపుగా లతీఫ్‌షా గుట్టపై ఉన్న దర్గా వద్దకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు తీసుకెళ్తారు। 60ఏండ్లుగా లతీఫ్‌షా దర్గా చైర్మన్లుగా హిందూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇక్కడి విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)