యూపీలోని బలియా జిల్లాలో చోటు చేసుకున్న పలు పాము కాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారితోపాటు మిగిలిన వారంతా 30 ఏళ్ళలోపు ఉన్న యువకులే. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కవగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలం కావటంతో పాములు బయటకు రావటం, వివిధ పనుల నిమిత్తం వెళుతున్నవారిని పాములు కరవటంతో ప్రమాదకరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో దూర ప్రాంతానికి వైద్యం కోసం బాధితులను తీసుకువెళ్ళే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు.
Post a Comment
0Comments
3/related/default