కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి !

Telugu Lo Computer
0


సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కత్తి మహేశ్‌ గాయాలను మరోసారి పరీక్షించారు. తలకు బలమైన గాయాలైనట్లు గుర్తించారు. ముక్కులో ఒక ఫ్యాక్చర్‌, కంటిలోపల మరో గాయమైందని వైద్యులు తెలిపారు. తలకు తగిలిన గాయాలకు సోమవారం శస్త్రచికిత్స చేయనున్నారని, కంటికి కూడా ఆపరేషన్‌ చేస్తారని సన్నిహితులు తెలిపారు. కంటి చూపునకు ఎలాంటి సమస్య ఉండదని, వైద్యులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వైద్యులు ఆపరేషన్‌ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)