ఆర్చరీలో భారత్ కు మూడు స్వర్ణాలు

Telugu Lo Computer
0

ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ మూడు స్వర్ణాలు  సాధించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆదివారం జరిగిన వరల్డ్‌కప్ స్టేజ్ 3 లో భారత క్రీడాకారులు మంచి ప్రతిభ చూపారు.  దీపిక కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌తో కూడిన బృందం మెక్సికోపై 5-1 తేడాతో సునాయాస విజయం సాధించింది. మరో వైపు మిక్సడ్ డబుల్స్ లో దాస్, దీపికా కుమారి నెదర్లల్యాండ్ ఆటగాళ్లపై 5-3 తేడాతో గెలిచి బంగారు పతకం కైవశం చేసుకున్నారు. శనివారం జరిగిన వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ బంగారు పతకం సాధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)