ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖారున ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.
Post a Comment
0Comments
3/related/default