* పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం !
* పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట !
* పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు !
* పండిత పుత్రః పరమశుంఠః !
* పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు !
* పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు !
* పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట !
* పెదవి దాటితే పృథ్వి దాటుతుంది !
* పెళ్ళంటే నూరేళ్ళ పంట !
* పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు !
* పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట !
* పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది !
* పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు !
* పిచ్చోడి చేతిలో రాయిలా !
* పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా !
* పిండి కొద్దీ రొట్టె !
