తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

Telugu Lo Computer
0

 


 తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనన పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్లను నియమించింది. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)