కత్తితో యువకుని హల్ చల్

Telugu Lo Computer
0

 

ఒక యువతి తనకు కాబోయే భర్తతో బయటకు వచ్చిన వారిపై  ఒక యువకుడు దాడికి ప్రయత్నించాడు. గుంటూరు అరండల్ పేట 4 వ లైన్ లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.  ఆమెతో ఉన్న యువకుడిని చంపుతానంటూ కత్తి చూపిస్తూ బెదిరించాడు.   అతనిపై దాడిచేసేందుకు యత్నించగా ఆ యువతి అడ్డుకుంది. స్థానికులు గమనించి యువకుడిని అడ్డుకోవడంతో దాడికి యత్నించిన వ్యక్తి అక్కడ నుండి పరారయ్యాడు. యువతి అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  స్థానికులు తీసిన వీడియోలు, సీసీ టివి పూతేజలు స్వాధీనం చేసుకొని నిందితుని కోసం గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)