మానసిక ఒత్తిడితో చాలా మంది బాధ పడుతుంటారు. ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేక చాలామంది చిన్న చిన్న ఇబ్బందులకే ఆత్మహత్యలకు ప్పాల్పడుతున్నారు. ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడానికి, మానసికంగా ఉపశమనం పొందడానికి లోతైన శ్వాస తీసుకోవడం, ధ్యానం వంటివి చేయడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకొస్తుంది. మానసికంగా ఒత్తిడి తగ్గాలంటే మీకు ఇష్టమైన అభిరుచులను ఆస్వాదించాలి. చాలామందికి సంగీతం వినడం, డాన్స్ చేయడం, కథలు, కవితలు రాయడం ఇలా ఏవో అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచులను ఆస్వాదిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తగ్గాలంటే ప్రకృతిలో సమయం గడపాలి. బయట నడవడం, ప్రకృతిలో సమయం గడపడం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు పనికి జీవితానికి మధ్య సమతుల్యత పాటించాలి. వర్క్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అలా బ్యాలెన్స్ చేస్తేనే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నడవడం, యోగా చేయడం వంటి శారీరక కార్యకలాపాలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు మనం మన ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు మానుకోవాలి. అవి తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్టు అనిపించవచ్చు కానీ శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించలేవు. ఇవి దీర్ఘకాలంలో ఒత్తిడిని మరింత పెంచుతాయి.
మానసిక ఒత్తిడి - నివారణోపాయాలు
October 06, 2025
0
Tags