ఆఫ్ఘనిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసిన పాకిస్తాన్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం విడుదలైన ప్రకటనలో జమ్మూ కాశ్మీర్‌పై ఉన్న అంశాలు, ఉగ్రవాదంపై ఆఫ్ఘనిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ నొచ్చుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం శనివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని పిలిచి తన నిరసనను వ్యక్తం చేస్తూనే, ఆఫ్ఘనిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసిం విదేశాంగ మంత్రి ముత్తఖీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి వచ్చారు. ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసింప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే ప్రాంతీయ దేశాల ఉగ్రవాద చర్యలను ఉమ్మడిగా ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్‌ను భారత దేశంలో అంతర్భాగంగా పేర్కొనడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమ్మూ కాశ్మీర్ గురించి చేసిన ఈ ప్రస్తావన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆఫ్ఘనిస్తాన్ రాయబారితో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. సంయుక్త ప్రకటనలోని అంశాలతో పాటు, ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ అంతర్గత సమస్య అంటూ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ముత్తఖీ చేసిన వ్యాఖ్యలను కూడా ఇస్లామాబాద్ ఖండించింది. ఉగ్రవాదాన్ని అరికట్టే బాధ్యతను పాకిస్తాన్ పై నెట్టడంతో పాటు శాంతిని, స్థిరత్వాన్ని భద్రపరచాల్సిన ఆఫ్ఘనిస్తాన్ బాధ్యత తీరిపోదని పాక్ పేర్కొంది. తమ భూభాగాన్ని ఉగ్రవాద శక్తులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ నొక్కి చెప్పింది. దశాబ్దాలుగా దాదాపు 40 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చినట్లు పాకిస్తాన్ గుర్తు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొన్నందున సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు తిరిగి సొంత గడ్డకు వెళ్లాలని పాకిస్తాన్ పునరుద్ఘాటించింది. అన్ని ఇతర దేశాల మాదిరిగానే తమ భూభాగంలో నివసిస్తున్న విదేశీయుల ఉనికిని నియంత్రించే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ తన ప్రకటనలో తెలిపింది. అయినప్పటికీ ఇస్లామిక్ సోదర భావంతో ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు విద్య, వైద్య వీసాలను జారీ చేయడాన్ని కొనసాగిస్తున్నట్లు పాకిస్తాన్ వివరించింది. ప్రాంతీయ అనుసంధానాన్ని, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ తమ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడం తమ ప్రధాన కర్తవ్యమని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)