ఎయిర్‌ చైనా లగేజ్‌ క్యాబిన్‌లో లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలడంతో మంటలు !

Telugu Lo Computer
0


తూర్పు చైనా నగరం హాంగ్ జౌ నుండి దక్షిణ కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రం మధ్య రాకపోకలు సాగించే ఎయిర్‌ చైనా CA139 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలోని లగేజ్‌ క్యాబిన్‌లో ఒక ప్రయాణీకుడు తెచ్చిన లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలడంతో విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో విమానంలో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫ్లైట్‌లో మంటలు చెలరేగడాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)