తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి ఆస్థానం దీపావళి పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీపావళి రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఒక ప్రత్యేకమైన పండుగ. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సహస్రదీపాలంకరణ సేవలో, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. స్వామివారి తోమాల సేవ. అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారిఆలయం, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాల్లో అక్టోబరు 20వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
దీపావళి సందర్భంగా తిరుమలలో దీపావళి ఆస్థానం : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు
October 18, 2025
0
Tags