ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తన వ్యూహాలను మరింత విస్తరించడానికి కొత్త, పథకాన్ని రూపకల్పన చేసింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ఎవరూ ఊహించని నష్టాన్ని చవిచూసింది. దాన్నిప్పుడు పూడ్చుకుని, తమ ఉనికిని తిరిగి చాటుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే తమ చరిత్రలో మొదటిసారిగా మహిళల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో మహిళలను సాయుధ, పోరాట మిషన్లలో పాల్గొనకుండా నిషేధించిన జైష్ సంస్థ, ఇప్పుడు వ్యూహాత్మక మార్పును ప్రకటించింది. 'జమాత్-ఉల్-మొమినాత్' పేరుతో ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీని కోసం పాకిస్థాన్ లోని బహావల్‌పూర్‌లోని మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ కేంద్రంలో నియామకాలు ప్రారంభం అయ్యాయి. ఈ 'జమాత్-ఉల్-మొమినాత్' విభాగాన్ని జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా విస్తరించాలని జైషే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే చదువుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు మదర్సాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తోంది.
'జమాత్-ఉల్-మొమినాత్' పేరుతో ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ !
October 09, 2025
0
Tags