పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

Telugu Lo Computer
0


పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎలాంటిచర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడి చేసిందని పాక్ అధికారులు ఆరోపించగా, వారు ప్రతిదాడులు ప్రారంభించారు. దీంతో ఇరుదేశాల సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆఫ్ఘాన్ యుద్ధ ట్యాంకులు, సైనిక పోస్టులను ధ్వంసం చేశామని పాక్ పేర్కొంది. ఖోస్ట్ ప్రావిన్స్‌ డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్ అహర్ కూడా ఘర్షణలను ధృవీకరించారు. పాక్ మీడియా ప్రకారం, ఆఫ్ఘాన్ దళాలు, టీటీపీ కలిసి తమ భూభాగంపై కాల్పులు జరిపారని తెలిపింది. దీనికి బలమైన ప్రతిస్పందనగా టీటీపీ శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతా అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)